Wednesday, April 18, 2007

 

హలంతాలను లొంగదీసుకోండి...

తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పుడు ఇక్కడ తెలిపిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు... కంప్యూటర్‌కు... హార్డ్‌వేర్‌లో... మానిటర్‌తో... మెషీన్‌పై... అని మీరు టైప్ చెయ్యాలనుకుంటే... హలంతాక్షరాలు, వాటితోపాటు టైప్ చేసిన అక్షరాలు కలిసిపోయి కంప్యూటర్కు... హార్డ్వేర్లో... మానిటర్తో... మెషీన్పై ఇలా వస్తాయి. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక చాలా మంది కంప్యూటర్ కు... హార్డ్ వేర్ లో... మానిటర్ తో... మెషీన్ పై... ఇలా హలంతాక్షరానికి, దాని వెంటనే టైప్ చెయ్యాల్సిన అక్షరానికి మధ్య ఒక ఖాళీ ఉంచి టైప్ చేస్తున్నారు. దీనికి ఓ పరిష్కారం ఉంది. వర్డ్ లేదా నోట్‌ప్యాడ్‌లో మీరు ఇలా చేసుకోవచ్చు.

హలంతాక్షరం టైప్ చెయ్యగానే దాని పక్కనే కర్సర్ ఉంచి Ctrl+Shift+2 కీలు కలిపి నొక్కండి. ఆ తర్వాత మీకు కావలసిన అక్షరాలను పక్కనే టైప్ చేసుకున్నప్పటికీ అవి హలంతాక్షరాలతో పైన చూపిన విధంగా కలిసిపోవు. Ctrl+Shift+2 కీల ద్వారా హలంతాక్షరం పక్కనే నాన్-జాయినర్ (ఇది కనిపించదు) చేర్చబడి, ఈ సమస్య లేకుండా చూస్తుంది.

ఇదే సమస్యకు మౌస్ ఉపయోగించి, నోట్‌ప్యాడ్‌లో కూడా పరిష్కారం పొందవచ్చు. హలంతాక్షరం పక్కనే మీ కర్సర్ ఉంచి, మౌస్ రైట్ క్లిక్ చెయ్యండి. అక్కడ కనిపించే మెనూలోంచి "INSERT UNICODE CONTROL CHARACTER" పైన మౌస్‌ను పాయింట్ చేస్తే... ఉప మెనూ తెరుచుకుంటుంది. ఇందులో "ZWNJ - Zero Width non-joiner" పైన క్లిక్ చెయ్యండి. దీంతో హలంతాక్షరం పక్కన నాన్-జాయినర్ (కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది. తర్వాత ఈ టెక్ట్స్‌ను వర్డ్, ఎక్సెల్ లేదా మీకు కావలసిన దానిలోకి కాపీ చేసుకోవచ్చు.
ఇదే పరిష్కారం కన్నడ భాషకూ వర్తిస్తుంది. దీనిపై జరిగిన చర్చలకు సంబంధించి, మిత్రుడు బాబ్ ఇచ్చిన కింది URL ద్వారా మరికొన్ని వివరాలు పొందవచ్చు.
http://bhashaindia.com/ForumV2/shwmessage.aspx?forumid=1&messageid=1738#bm2414

Labels:


Comments:
నోట్‌పాడ్‌లో రైట్ క్లిక్ మెనూలో "Show Unicode control characters" అనే ఎంపిక ద్వారా ZWNJ ని కూడా చూడవచ్చు.
 
అసలు తెలుగు అక్షరాలను లేఖిని నుంచి కాపీ చేసి నోటుపాడ్ లో పేస్ట్ చేస్తే అక్షరాలన్ని చిన్న చిన్న బాక్స్ లాగా కనపడుతున్నయి. నోటుపాడ్ లో తెలుగు అక్షరాలు కనపడాలంటే ఏమి చేయాలి?
 
after copying the text apply Gautami font. (I am giving this reply from a browsing centre, hence couldn't use telugu font)
 
Unicode lo doe key board vadavacha sir.
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?