Friday, April 21, 2006

 

తమిళం కాస్త గరళం

తమిళ భాష రాయడం తేలిక. మాట్లాడటం, చదవడం కష్టం. చాలా వరకూ అనుభవం, అలవాటుతో నేర్చుకొని, సందర్భానుసారం ఉచ్ఛారణ ప్రయోగం చేయాల్సిన భాష. ఉచ్ఛారణ తేడా వస్తే అంతా గజిబిజే. తెలుగు భాషలో మనం దాదాపుగా పక్కన పెట్టేసిన ఞ, ఙ అక్షరాలు ఈ భాషలో విస్తృత వాడుకలో ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏమంటే.... తమిళంలో మీరు గాంధి అని రాస్తే అది కాంతి లేదా కాంది లేదా గాంతి లాంటి పలు ఉచ్ఛారణలకు దారి తీస్తుంది. అందువల్ల సందర్భసహిత ఉచ్ఛారణ చాలా ముఖ్యం.

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అక్
அ ஆ இ ஈ உ ஊ எ ஏ ஐ ஒ ஓ ஔ ஃ

తమిళంలో ఒత్తులు లేవు. అంటే.... క గ చ జ ట డ ప బ వంటి సాదా అక్షరాలే ఉన్నాయి. ఖ ఘ ఛ ఝ ఠ ఢ ఫ భ లాంటి ఒత్తు అక్షరాలు లేవు. ఇది హలంత భాష. అయితే ఒత్తులు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా రాస్తారు. ఉదాహరణకు...
అక్క అనే పదాన్ని తమిళ అక్షరాల్లో అక్‌క (அக்க) అని రాస్తారు.
మర్మము అనే పదాన్ని తమిళ అక్షరాల్లో మర్‌మము (மர்மமு) అని రాస్తారు.

ఈ భాషలోని మరో విచిత్రం ఏమంటే, చాలా వరకూ రెండు ఉచ్ఛారణలకు ఒకే అక్షరాన్ని రాస్తారు. ఎలాగంటే....
క, గ అక్షరాలు రెంటినీ తో సూచిస్తారు.
-
చ, శ, జ అక్షరాలు మూడింటినీ ఆయా సందర్భాల మేరకు తో సూచిస్తారు.
అయితే ఇంగ్లీషులోని J, Z ఉచ్ఛారణలకు కూడా ఉపయోగిస్తారు.
ఞ, జ్ఞ అక్షరాలు రెంటినీ తో సూచిస్తారు
ట, డ అక్షరాలు రెంటినీ తో సూచిస్తారు.
-
త, ద అక్షరాలు రెంటినీ తో సూచిస్తారు.
ప్రారంభాక్షరంగా వస్తే తో సూచిస్తారు. మధ్యలో వస్తే తో సూచిస్తారు.
ప, బ అక్షరాలు రెంటినీ తో సూచిస్తారు.
-
య ర ల వ ష స హ ళ క్ష ఱ
ய ர ல வ ஷ ஸ ஹ ள க்ஷ ற

శ్రీ అనే అక్షరాన్ని తమిళంలో ஸ்ரீ తో సూచిస్తారు

తమిళంలో ఉన్న మరో అక్షరం . దీనిని ష, జ లకు మధ్యలో ఉచ్ఛరిస్తారు.

కొన్ని సందర్భాల్లో ఉచ్ఛారణ గాను, ఉచ్ఛారణ గాను ఉంటుంది.

అదే విధంగా (అక్) ను ( '' ఉచ్ఛారణ ఉన్నప్పుడు... )తో చేర్చి రాస్తే ఆంగ్లంలో F ఉచ్ఛారణకు సమానమవుతుంది. అంటే ఫ్యాన్, ఫాదర్ వంటి శబ్దాలలో ఫా అక్షరానికి సమానం. ఈ అక్షరం ఇక్కడ తప్ప మరే సందర్భంలోనూ ఏ అక్షరంతోనూ చేరదు.


తమిళంలో సున్న లేదు. అందువల్ల ఈ ఉచ్ఛారణ వచ్చినప్పుడు
ఙ్(ங்), ఞ్(ஞ்), మ్(ம்), న్(ந், ன்), ణ్(ண்) వంటి వాటితో భర్తీ చేస్తారు.


ఒక గుణింతాన్ని కూడా పరిశీలిద్దాం...
క్ క కా కి కీ కు కూ

க் க கா கி கீ கு கூ

కె కే కై కొ కో కౌ
கெ கே கை கொ கோ கௌ

Labels:


Comments:
Nice write up.

But what is the history behind this over burdening of letters?

How come poeple living with this half powered script?
 
చాలా చక్క గా వ్రాశారు.
 
చాలా విశయాలు తెలిసాయి మీ బ్లాగు ద్వారా!

--ప్రసాద్
http://blog.charasala.com
 
నేను కూడా మీలాగే ఆసక్తితో కన్నడ, తమిళ భాషలను వ్రాయడం నేర్చుకున్నాను. పేర్లు చదవగలను కానీ, కచటతపలతో నానా తిప్పలు పడుతుంటాను.
 
చాలా యాదృచ్చికంగా మీ బ్లాగుని చూడడం జరిగింది. చాల బాగుంది. నాకు తమిళం నేర్చుకోవాలనే ఆసక్తి! మీ బ్లాగు ద్వారా సాధ్యమవుతుందా?
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com
 
tikamaka pette tamil acchulu kanivandi leka hallulu kanivandi chala chotla oke padhani sandarbani batti vadutunaru endukani?

kotta vallu tamil nerchukovalante chala ibandhe mari? kanchi tanga meru annatu oka guruvu undalcinde. leke pote chaala tedalostaee........

thanks for the clarifying my doubts , i was confusing a lot how to use this ka , cha , da , ba etc., etc.,

nice presentation

N.Naresh
 
This comment has been removed by the author.
 
మీకు క చ ట త ప లు పలకటానికి ఈ సలహాలు ఉపయోగపడగలవు అని భావిస్తున్నాను
తమిళ హల్లులు మూడు రకాలు
వళ్ళినం (పరుషాలు) క చ ట త ప ఱ
మెళ్ళినం (అనునాసికాలు) ఙ ఞ ణ న మ 'న
ఇడైనం (అవర్గీకృతాలు) మిగతా హల్లులు
అక్షరం-పదం మొదట్లో/పరుషానికి తరువాత - అనునాసికానికి తరువాత - ఇడైనం కు తరువాత -ద్విత్వం గా ఉన్నప్పుడు
క - క - గ - హ (ఇది గ కి హ కి మధ్యలో పలకాలి; బ్రాహ్మణులు బాహా/ ఒహటి అన్నట్టు )- క్క
ట - ట - డ - డ - ట్ట
త - త -ద - ద - త్త
ప - ప - బ - బ/వ (రెండూ ఒప్పే) -ప్ప
ఱ - ఱ - ండ (pure)/ ండ్ర (colloquial)- ఱ - ట్ట (pure)/ ట్ర (colloquial) *
చ - చ** -జ -జ/స *** -చ్చ
* --> ట్ర/ ండ్ర లు alveolars = english t,d ki laaga palakaali
** --> చ ని ఉత్తర తమిళం లో స గానూ దక్షిణం లో చ గానూ, నైరృతి లో జ గాను, బ్రహ్మణులు/ముసలి(పెద్ద) వాళ్ళూ శ గాను పలుకుతారు. మీఱు ఎలా పలికినా ఇక్కడ అర్థం మారదు.
మీ టపా లో మఱి కొన్ని దిద్దు బాట్లు ఉన్నయి అవి మీకు కావాలి అంటే వ్రాస్తాను.
 
Post a Comment



<< Home

This page is powered by Blogger. Isn't yours?